గుంతలమయంగా మారిన ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలి

రిపోర్టర్: bhukya Narasimha rao స్థలం: జులూరుపాడు

జులూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామం వద్ద ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారి వర్షం నీటితో గుంతలమయంగా మారిందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొత్తగూడెంలో ఆర్అండ్బీ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేసి, వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.