మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన

రిపోర్టర్: Alfa News స్థలం: వరంగల్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తనను పోలీసులు కడుపులో తన్నారని, చేయి విరిగిందంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.