తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బ్రిటన్ వ్యాపార ప్రతినిధులకు భరోసా కల్పించారు. బుధవారం హైదరాబాద్లో బ్రిటన్లోని యార్క్షైర్ ప్రాంత ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో తయారీ రంగాన్ని విస్తరించడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.