విద్యుత్ సౌధ వద్ద ఏఐటీయూసీ ధర్నా: సింగరేణి బకాయిలు చెల్లించాలని డిమాండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
సింగరేణి సంస్థకు తెలంగాణ జెన్కో ట్రాన్స్‌కో చెల్లించాల్సిన యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ కార్యాలయంలో వందలాది మంది కార్మికులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.