ఆధారాల్లేకుండా రీ పోలింగ్ సాధ్యం కాదు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా స్పష్టీకరణ
రిపోర్టర్: హరి
స్థలం: Amaravati
ఆధారాలు లేకుండా రీ పోలింగ్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎప్పుడూ తటస్థంగానే ఉంటుందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసిందని, చిన్నపాటి ఫిర్యాదులపై కలెక్టర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని ఇప్పటివరకు 275 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 107 మందిని అరెస్టు చేసినట్లు ఐజీ రాజకుమారి పేర్కొన్నారు.