తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా మైసిగండిలో గిరిజన మోర్చా నేతల సమరశంఖం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం మైసిగండిలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రానున్న కాలంలో తెలంగాణలో పార్టీ అధికారమే లక్ష్యంగా గిరిజన నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.