ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్న హోంమంత్రి అనిత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనకాపల్లి
ప్రజల భద్రతే పోలీసు వ్యవస్థకు తొలి ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆధునిక నేరాలను సమర్థంగా ఎదుర్కొనేలా సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ నేరాలపై అవగాహనతో పోలీసు సిబ్బందిని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అనకాపల్లిలో 149 మంది కొత్త కానిస్టేబుళ్లు ఆధునిక శిక్షణతో విధుల్లోకి చేరారని, విధుల్లో క్రమశిక్షణతో పాటు నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని నూతన సిబ్బందికి ఆమె పిలుపునిచ్చారు.