ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో మొక్కలు నాటిన నాయకులు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటారు. మోడీ 25 ఏళ్ల ప్రజాసేవలో దేశ అభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.