సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పొదలకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పీఎంకేకేకేవై నిధులతో నూతనంగా నిర్మించిన భోజనశాలలను గురువారం ఆయన ప్రారంభించారు. బాలికల ఉన్నత పాఠశాలకు నాబార్డు నిధులతో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.