విజయనగరం అభివృద్ధికి రూ. 6.88 కోట్ల నిధులు విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం పట్టణ అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన రూ. 6.88 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా విజయనగరం పట్టణంలోని 1వ డివిజన్ లక్ష్మీగణపతి కాలనీలో అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నిధులతో స్థానిక ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన వేగవంతం కానుంది.