శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసులో 15 మందికి సుదీర్ఘ జైలు శిక్ష

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీలంక

శ్రీలంకలో 2019లో జరిగిన ఈస్టర్ ఆదివారం ఆత్మాహుతి బాంబు దాడుల కేసులో కొలంబో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు నౌఫర్ మౌలవితో పాటు మొత్తం 15 మందిని దోషులుగా నిర్ధారించి వారికి 200 నుంచి 260 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. ఐసిస్ ప్రేరణతో జరిగిన ఈ దాడుల్లో 270 మంది ప్రాణాలు కోల్పోగా, సరైన ఆధారాలు లేకపోవడంతో మరో 9 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.