జహీరాబాద్లో ఘనంగా రాక్ డ్యాన్స్ స్టూడియో దాండియా సక్సెస్ మీట్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
జహీరాబాద్ పట్టణంలో రాక్ డ్యాన్స్ స్టూడియో ఈవెంట్స్ టీమ్ ఆధ్వర్యంలో పీవీఆర్ గార్డెన్లో నిర్వహించిన మెగా దాండియా కార్యక్రమం ఘన విజయవంతమైంది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాథోడ్ సుభాష్ మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు, సంఘసేవకులు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు.