కాకినాడ సీఐఐ సదస్సులో రూ.4,256 కోట్ల భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

రిపోర్టర్: మహేష్ స్థలం: కాకినాడ

కాకినాడ కేంద్రంగా గోదావరి జిల్లాల్లో పెట్టుబడుల జోరు పెంచేలా సీఐఐ ప్రాంతీయ సదస్సులో నాలుగు వేల రెండువందల యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనలతో పద్నాలుగు వేల మందికి పైగా యువతకు నూతన ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. బ్లూ ఎకానమీ మరియు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిలో ఈ జిల్లాలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.