ఎల్నినో సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంలా మారిన పోలవరం కాలువలు
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో తీవ్ర ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ, పోలవరం కుడి, ఎడమ కాలువలు గోదావరి వరద నీటిని తరలించి రైతులకు, తాగునీటి అవసరాలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు, విశాఖపట్నం తాగు, సాగునీటి అవసరాలకు గోదావరి జలాలు జీవధారగా నిలిచాయి.