ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి పొంగులేటి
రిపోర్టర్: రమేష్
స్థలం: ఖమ్మం
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే కొద్ది రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో పర్యటించిన ఆయన, ఇల్లు పూర్తయినా బిల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అర్హులైన నిరుపేదలందరికీ మరో మూడు, నాలుగు విడతల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.