నిరుద్యోగులకు తీపి కబురుగా ఐబీపీఎస్ పీవో ఫలితాల విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్స్టిట్యూట్ ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఫలితాల లింక్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావాలని అధికారులు స్పష్టం చేశారు.