ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ: ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటిన సమాజ్‌వాదీ పార్టీ
రిపోర్టర్: రాము
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. యూపీలో బీజేపీ ఆరు స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ నాలుగు స్థానాలు దక్కించుకుని మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు బీజేపీ వైఫల్యానికి నిదర్శనమని, రాష్ట్రంలో కమల దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.