గాయం కారణంగా క్రికెట్కు మరోసారి దూరమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
కుడి కాన్ కండరాల నొప్పి తిరగబెట్టడంతో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్ పునరాగమనం మరోసారి ఆలస్యం అయినట్లు బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది. అక్టోబర్ 6 నుంచి పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్ల సిరీస్కు ఆయన దూరమయ్యారని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సాధన చేస్తున్న ఆయనకు మళ్లీ నొప్పి రావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.