నర్సంపేట: బతుకమ్మ వేడుకల్లో అల్లి పూల తీవ్ర కొరతతో మహిళల ఆవేదన

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, చెరువుల్లో విరివిగా లభించే అల్లి పూలు అందుబాటులో లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంప్రదాయబద్ధంగా పూలను పేర్చాలనుకునే తమకు ఈ కొరత పెద్ద సమస్యగా మారిందని నర్సంపేట ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.