శాస్త్రీయ సంచలనం: డైనోసార్ ఎముకలో బయటపడిన తొలి రక్త కణాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: బ్రెజిల్
డైనోసార్ల కాలం నాటి ఎముకలో అరుదైన రక్త కణాలు బయటపడ్డాయని కర్టిన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. బ్రెజిల్ లో లభించిన నూట పదిహేను మిలియన్ల ఏళ్ల నాటి డైనోసార్ శిలాజంలో ఎర్ర రక్త కణాలు, హీమ్ అణువుల ఆనవాళ్లను గుర్తించినట్లు ప్రధాన పరిశోధకులు ప్రొఫెసర్ క్లిటి గ్రేస్ తెలిపారు. శిలాజాల చరిత్రలో జీవ అణువులు లభించడం ఇదే తొలిసారని, ఇది మైలురాయి లాంటి సంచలన ఆవిష్కరణ అని ఆయన పేర్కొన్నారు.