పేదలకు రూ.5 లక్షలతో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున రూ.40,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా ఆర్థిక సాయం అందిస్తూ, నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.