అక్రమ పటాకుల షాపులపై మున్సిపల్ కమిషనర్ ఉక్కుపాదం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
దీపావళి పండుగ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. బాణాసంచా దుకాణాలను నివాస ప్రాంతాలలో ఏర్పాటు చేయరాదని, అనుమతులు పొందిన నిర్దేశిత స్థలాలలో మాత్రమే విక్రయాలు జరపాలని హెచ్చరించారు.