నా చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగానే ప్యారడైజ్ జడల్ పాత్రను మలిచానని తెలిపిన శ్రీకాంత్ ఓదెల
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: తెలంగాణ
టాలీవుడ్ లో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ప్యారడైజ్ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు తన చిన్ననాటి ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తనకు ఐదు, ఆరు సంవత్సరాలు వచ్చే వరకు అమ్మ జడలు వేసేదని, ఆ స్ఫూర్తితోనే బిగ్ స్క్రీన్ పై హీరోను జడలతో చూపించాలని ఊహించుకున్నానని తెలిపారు. ఈ చిత్రంలో నాని జడల్ పాత్రలో నటిస్తుండగా సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.