తల్లి ఒడికి చేరిన చిన్నారి: మంత్రి సీతక్క చొరవతో బాలుడి అప్పగింత
రిపోర్టర్: గోపి
స్థలం: జగిత్యాల
రెండు నెలల నిరీక్షణ తర్వాత మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో దత్తత వివాదంలో తల్లిదండ్రులకు దూరమైన మూడేళ్ల బాలుడు ఎట్టకేలకు తిరిగి ఇంటికి చేరాడని కుటుంబ సభ్యులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలప్పటికీ సీడబ్ల్యూసీ అనుమతి పేరుతో జాప్యం జరగడంతో, మీడియాలో వచ్చిన వరుస కథనాలపై స్పందించిన మంత్రి అధికారులను ఆదేశించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింపజేశారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసిందని, తమ బిడ్డ తిరిగి రావడానికి కృషి చేసిన మీడియాకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.