దివ్యాంగుల ప్రయాణాలకు ఊరట: రొటేటింగ్ సీట్లను అభివృద్ధి చేసిన బెంగళూరు సంస్థ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Bengaluru
దివ్యాంగులు మరియు వృద్ధుల ప్రయాణాలను సులభతరం చేసేందుకు బెంగళూరుకు చెందిన ట్రూ అసిస్టివ్ టెక్నాలజీ సంస్థ నూతన రొటేటింగ్ కార్ సీట్లను అభివృద్ధి చేసినట్లు వ్యవస్థాపకులు నైనా పదాకి, ఆనంద్ కుత్రే వెల్లడించారు. ఈ ప్రత్యేక సీట్ల ద్వారా వాహనాల్లోకి ఎక్కడం సులభతరమైందని, గతంలో కుటుంబ సభ్యులు పడిన కష్టాలు తొలిగాయని తెలిపారు. దివ్యాంగుల రవాణా ఇబ్బందిని అధిగమించడానికి రూపొందించిన ఈ సాంకేతికత అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా మారిందని వారు స్పష్టం చేశారు.