నెల్లూరులో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ఏపీఐఐసీ కీలక ప్రకటన
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో స్థానిక యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని ఏపీఐఐసీ జోనల్ కమిషనర్ శివకుమార్ తెలిపారు. ఈనెల 24న కస్తూర్బా కళాక్షేత్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని పార్కులు ఉత్పత్తి దశలో ఉండగా మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయని వివరించారు.