హైదరాబాద్ లో గుట్టురట్టు: భారీ అక్రమ అండ దానం రాకెట్ గుట్టు రట్టు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ అక్రమ అండ దానం రాకెట్‌ను మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు భగ్నం చేశారని అధికారులు తెలిపారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ హాస్టళ్ల ముసుగులో ఈ దందా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాన సూత్రధారితో పాటు ఎనిమిది మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ దందాతో సంబంధం ఉన్న ఇరవై మూడు ఐవీఎఫ్ కేంద్రాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.