వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా బెల్లానా చంద్రశేఖర్ నియామకం

రిపోర్టర్: GANESH BBL స్థలం: చీపురుపల్లి

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన మాజీ ఎంపీ బెల్లానా చంద్రశేఖర్ ని ఆ పార్టీ బొబ్బిలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొత్స కాశి నాయుడు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.