సెన్సార్ పూర్తి చేసుకున్న సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
వైవిధ్యమైన కథలతో అలరించే హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్ నటిస్తున్నారు.