ఆదర్శనగర్ కాలనీలో ముప్పై ఏళ్ల కల సాకారమంటూ స్థానికుల హర్షం

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీ 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ముప్పై ఏళ్లుగా రోడ్డు లేక ఇబ్బందులు పడిన తమకు ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ సహకారంతో మోక్షం లభించిందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్ముల శేఖర్, మహ్మద్ అబ్దుల్ రఫీ, వలి, రమేష్, నవీన్ గిరి తదితరులు పాల్గొని మాట్లాడారు.