కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హర్షం

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల దీర్ఘకాలిక బకాయిల చెల్లింపునకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం ఫ్యాక్టరీని కేవలం ఎన్నికల అస్త్రంగా వాడుకుందని ఆమె మండిపడ్డారు. సుమారు నాలుగు వందల మంది ఉద్యోగుల బకాయిల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించారని పేర్కొంటూ, ఆదివారం ఆయన చిత్రపటానికి కార్మికులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.