బెవర్లీ హిల్స్ లో భారీ భవనం కూల్చివేత: నూతన నిర్మాణాలతో లెబ్రాన్ జేమ్స్
రిపోర్టర్: గోపి
స్థలం: Beverly Hills
అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ తన రెండున్నర ఎకరాల బెవర్లీ హిల్స్ ఎస్టేట్ లో చారిత్రాత్మక భవనాన్ని కూల్చివేసి కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. సుమారు ముప్ పై ఆరు కోట్ల డాలర్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీలో రెండు వేర్వేరు నివాసాలను ఆయన అత్యంత గోప్యంగా నిర్మిస్తున్నారని, భద్రతా కారణాల దృష్ట్యా కార్మికులతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని క్రీడా వర్గాలు తెలిపాయి.