ఈసీ జ్ఞానేష్ కుమార్ పై రాహుల్ గాంధీ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

దిల్లీలో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ లో కోట్లాది ఓట్లను తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము పోరాటం కొనసాగిస్తామని, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను సహించబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.