సినిమాటోగ్రాఫ్ నిబంధనలు: సెన్సార్ బోర్డు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన వైన
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
చిత్ర పరిశ్రమకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఎలాంటి అసంపూర్ణ చిత్రాలను పరిశీలనకు స్వీకరించబోమని, విడుదల తేదీలు ముందుగా ప్రకటించినా వేగంగా సర్టిఫికేట్ పొందలేరని స్పష్టం చేశారు. సినిమాటోగ్రాఫ్ చట్టం కింద దరఖాస్తు చేసే దర్శక నిర్మాతలు అన్ని అంశాలతో పూర్తి చేసిన చిత్రాలనే సమర్పించాలని బోర్డు తేల్చిచెప్పింది.