మొబైల్ యూజర్లకు షాక్: త్వరలో భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
సామాన్యులపై మరో ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, త్వరలో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి టెలికాం టారిఫ్ లు పదిహేను శాతం వరకు పెరిగే సూచనలు ఉన్నాయని వారు అంచనా వేశారు. నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ పెంపు మరింత ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుందని స్పష్టం చేశారు.