నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
సోషల్ మీడియాలో తనపై వస్తున్న నిరాధార వార్తలు, కట్టుకథలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వానాన్ని రాజకీయాలతో ముడిపెట్టి కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి పసలేని ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దివంగత వైఎస్సార్ బిడ్డగా తనకు అలాంటి సంస్కృతి లేదని, పెళ్లికి అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించడంలో ఎలాంటి రాజకీయాలు లేవని తేల్చిచెప్పారు.