'రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు': 77వ సారి రక్తదానం చేసిన లాలం చందు
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జనసేన సీనియర్ నాయకుడు లాలం చందు మంగళవారం 77వసారి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక ఇబ్బంది పడే బాధితులను కాపాడేందుకు ఏళ్లుగా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలబెట్టేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 77వ సారి రక్తదానం చేసిన లాలం చందును పలువురు నేతలు, అభిమానులు అభినందించారు.