జాతీయ రహదారుల టోల్ పాస్ ఇకపై ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారులకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారు ఇకపై టోల్ ప్లాజాల వద్దకు వెళ్లకుండానే ఫాస్టాగ్ లోకల్ పాస్‌లను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. దిల్లీలో విజయవంతమైన ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా మరో 130 చోట్ల అమలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 12 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల స్థానికులకు సమయం ఆదా కావడంతో పాటు ఇబ్బందులు తొలగనున్నాయి.