'తహసీల్దార్లకే నివాస ధ్రువీకరణ అధికారాలు': విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం బిగ్ ఊరట

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించేలా నివాస ధ్రువీకరణ పత్రాల జారీ విధానంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమలులో ఉన్న పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ, రెసిడెన్స్ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారాన్ని మళ్లీ తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015 నాటి జీవోను రద్దు చేయడం ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రవేశాలు మరియు ఉద్యోగ అవకాశాల కోసం తహసీల్దార్ల ద్వారా సర్టిఫికెట్లు పొందే అవకాశం లభించింది.