అంతకపేట పాఠశాలలో ఘనంగా నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అక్కన్నపేట
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో మంగళవారం రోజున స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ కొయ్యడ సృజన కుమార్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తమ బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను నాటారు.