బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొత్త సూపర్ హీరో సినిమా!
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరో కొత్త సూపర్ హీరో సినిమాకు సిద్ధమవుతున్నారు. లోకేశ్ కనగరాజ్‌తో ప్రాజెక్ట్ రద్దయిన తర్వాత, ఆయన ఆర్ బాల్కీ దర్శకత్వంలో నటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.