సింగపూర్ జూ తరహాలో విశాఖ, తిరుపతి జూ పార్కులు అభివృద్ధి
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్కులను సింగపూర్ మందాయ్ వన్యప్రాణి కేంద్రం తరహాలో అభివృద్ధి చేయాలని శాసనసభ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సీఎస్ఆర్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు టీటీడీ నిధులను కేటాయించి పర్యాటకంగా తీర్చిదిద్దాలని, సందర్శకుల సంఖ్యను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.