రామాయణ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్: వంద కోట్ల వసూళ్ల సునామీ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణ చిత్రం మొదటి భాగం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా పదిహేను లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని, అమెరికాలోనూ ప్రీమియర్ల ద్వారా భారీ స్పందన లభించిందని సినీ విశ్లేషకులు తెలిపారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్ లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.