ముంబైలో ఆధ్యాత్మిక కీర్తనల వేడుకలో పాల్గొన్న అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

ముంబైలో ప్రముఖ సంగీతకారుడు కృష్ణ దాస్ నిర్వహించిన ఆధ్యాత్మిక కీర్తనల వేడుకలో సినీ నటి అనుష్క శర్మ మరియు ఆమె భర్త, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉత్సాహంగా పాల్గొన్నారుని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తి గీతాలకు అనుగుణంగా అనుష్క శర్మ భజనలు పాడుతూ కనిపించగా, సాధారణ దుస్తులలో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.