న్యూజిలాండ్ పర్యటనలో భారత్ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి అవకాశం
రిపోర్టర్: గోపి
స్థలం: New Zealand
భారీ షెడ్యూల్ కారణంగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15న చివరి వన్డే ముగిసిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుండటంతో, ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.