కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన జాషువా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అవమానాలు, కుల వివక్షను ధైర్యంగా తన రచనల్లో ప్రశ్నించిన మహనీయుడు గుర్రం జాషువా అని డాక్టర్ ఆర్.బి వాణిశ్రీ తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఎస్.వి. ఏ ప్రభుత్వ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రిన్సిపాల్ వాణిశ్రీ ప్రసంగిస్తూ జాషువా తన కవిత్వాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించారని కొనియాడారు.