తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుపతి

తిరుమల కొండపై భక్తుల రవాణా సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అనంత్ అంబానీ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సుల్లో మొదటి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభించనున్నారు. ‘శ్రీవారి ధర్మరథం’ పేరుతో నడిచే ఈ బస్సుల్లో భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చు.