ప్రజాపాలన స్ఫూర్తితో వర్ధన్నపేటలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో తహశీల్దార్ విజయసాగర్, మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్నతో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొని జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తూ ప్రజాపాలన ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.