ఈదురుగాలులతో విరుచుకుపడ్డ వర్షానికి అతలాకుతలమైన కావలి

రిపోర్టర్: sujith reddy స్థలం: కావలి

నెల్లూరు జిల్లా కావలి పట్టణ ప్రాంతంలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా కురిసిన వానతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గత నెలలో సముద్రం ఇరవై అడుగుల మేర వెనక్కి వెళ్లిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.