సినిమా రంగంలోకి హీరో శ్రీకాంత్ కుమార్తె: మైత్రీ మూవీస్ కొత్త చిత్రం ప్రారంభం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ మేక మైత్రీ ఇన్ లవ్ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నట్లు చిత్రబృందం సోమవారం వెల్లడించింది. పృథ్వి వనం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ చిత్రంలో జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంటుందని మేకర్స్ పేర్కొన్నారు.